Site icon TeluguMirchi.com

Epic Movie: బాక్సాఫీస్‌పై కన్నేసిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ.. సెప్టెంబర్ 3 రిలీజ్ వెనుక బిగ్ ప్లాన్!

Epic

Epic Movie: చిత్ర పరిశ్రమలో సరైన రిలీజ్ తేదీ దొరికితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతాయి. అందుకే మేకర్స్ ఎప్పుడూ లాంగ్ వీకెండ్స్, పండుగ సెలవులపై కన్నేస్తుంటారు. ‘బేబి’ ఫేమ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ తెలుగు సినిమా . ‘ఎపిక్’ (Epic). ఈ చిత్రాన్ని ’90s – A Middle Class Biopic’ ఫేమ్ ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ‘సంచారమే’ అనే వీడియో సాంగ్ మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. ఈ మోస్ట్ ఎవైటెడ్ భారీ ప్రాజెక్ట్ రిలీజ్ కోసం మేకర్స్ సెప్టెంబర్ 3వ తేదీని లాక్ చేస్తూ ఎపిక్ ప్లాన్ చేసినట్లు (Epic) ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. నిజానికి ఈ తేదీ సినిమా వసూళ్లకు ఒక భారీ బూస్ట్‌లా మారబోతోందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 3న సినిమాను రిలీజ్ చేయడం వెనుక ఉన్న ప్రధాన కారణం.. ఆ తర్వాత వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమి లాంగ్ వీకెండ్. సెప్టెంబర్ 4న జన్మాష్టమి ప్రభుత్వ సెలవు దినం కావడంతో పాటు, ఆపై శని, ఆదివారాలు కలిసి రానున్నాయి. దీనివల్ల చిత్రానికి ఏకంగా 4 రోజుల సుదీర్ఘమైన ఓపెనింగ్ వీకెండ్ అడ్వాంటేజ్ లభించనుంది. మొదటి నాలుగు రోజుల్లోనే భారీ ఓపెనింగ్స్ సాధించడానికి ఈ విండో ఎంతగానో ఉపయోగపడనుందని చెబుతున్నారు. కేవలం జన్మాష్టమి మాత్రమే కాకుండా, ఆ వెంటనే వచ్చే వినాయక చవితి (గణేష్ చతుర్థి) నవరాత్రుల సెలవులు కూడా ఈ సినిమా థియేట్రికల్ రన్‌కు భారీగా కలిసి రానున్నాయని మేకర్స్ అభిప్రాయపడుతున్నారట.

పండుగ సీజన్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సుదీర్ఘ సెలవుల కాలం ముగిసే వరకు బాక్సాఫీస్ వద్ద మరే ఇతర పెద్ద సినిమాలు రేసులో లేకపోతే, ఈ చిత్రం లాంగ్ రన్‌లో భారీ వసూళ్లను రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ టైంలో థియేటర్స్‌లో సరైన కంటెంట్ పడితే సినిమా రేంజ్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version