
టాలీవుడ్‌లో వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నిర్మాత అనిల్ సుంకర మరో వినూత్న ప్రయత్నంతో ముందుకు వచ్చారు. కొత్త ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఆయన ప్రారంభించిన ‘షో టైమ్ – సినిమా తీద్దాం రండి’ రియాలిటీ షో మంచి స్పందన పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే విజన్‌ను మరింత విస్తరింపజేస్తూ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.
ఏటీవీ ఒరిజినల్స్ (ATV Originals) బ్యానర్‌పై రూపొందుతున్న ఈ కొత్త చిత్రానికి ‘ఎయిర్‌ఫోర్స్ – బెజవాడ బ్యాచ్’ (AIRFORCE – Bezawada Batch) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో పూర్తిగా కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేయడం విశేషం. ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్ ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
ఈ సినిమాతో దర్శకుడిగా అనిల్ కైవల్య టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. “కొత్త ఏడాది.. కొత్త ఆరంభం.. కొత్త కెప్టెన్” అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఏటీవీ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
