కొత్త టాలెంట్‌కు ఛాన్స్.. ‘ఎయిర్‌ఫోర్స్–బెజవాడ బ్యాచ్’తో అనిల్ సుంకర సర్‌ప్రైజ్

Airforce bezawada batch
టాలీవుడ్‌లో వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నిర్మాత అనిల్ సుంకర మరో వినూత్న ప్రయత్నంతో ముందుకు వచ్చారు. కొత్త ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఆయన ప్రారంభించిన ‘షో టైమ్ – సినిమా తీద్దాం రండి’ రియాలిటీ షో మంచి స్పందన పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే విజన్‌ను మరింత విస్తరింపజేస్తూ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.

Also Read :  మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ నుంచి ప్రశంసలు.. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ టాలెంట్‌కు గ్లోబల్ గుర్తింపు!

ఏటీవీ ఒరిజినల్స్‌ (ATV Originals) బ్యానర్‌పై రూపొందుతున్న ఈ కొత్త చిత్రానికి ‘ఎయిర్‌ఫోర్స్ – బెజవాడ బ్యాచ్’ (AIRFORCE – Bezawada Batch) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో పూర్తిగా కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేయడం విశేషం. ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్ ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.

Also Read :  రైతుల మధ్య వినూత్న ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్న “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” సినిమా

ఈ సినిమాతో దర్శకుడిగా అనిల్ కైవల్య టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. “కొత్త ఏడాది.. కొత్త ఆరంభం.. కొత్త కెప్టెన్” అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఏటీవీ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు.