Site icon TeluguMirchi.com

Anirudh Ravichander: టాలీవుడ్‌లో అనిరుధ్ ఊచకోత.. ఒక్కో సినిమాకు రూ.25 కోట్లా రెమ్యూనరేషన్ ?

Anirudh

Anirudh Ravichander: కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ క్రేజ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో పీక్స్‌కు చేరింది. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లందరినీ వెనక్కి నెడుతూ.. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న సంగీత దర్శకుడిగా అనిరుధ్ సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అనిరుధ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక్కో భారీ ప్రాజెక్టుకు దాదాపు రూ.25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రానికి అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ గ్లోబల్ లెవెల్‌లో సంచలనం సృష్టించాయి. ఈ సక్సెస్ జోష్‌తో టాలీవుడ్ స్టార్ హీరోలు, టాప్ ప్రొడక్షన్ హౌసెస్ అంతా అనిరుధ్ వెనకే పడుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం అనిరుధ్ ఖాతాలో వరుసగా టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్టులు వచ్చి చేరుతున్నాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ పొలిటికల్ డ్రామాకు అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌కు కూడా అనిరుధ్ సంగీతం అందించడానికి సంతకం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన థీమ్ ట్రాక్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న ప్రతిష్టాత్మక మైథలాజికల్ యాక్షన్ డ్రామాలోనూ అనిరుధ్ రవిచంద్రనే సంగీత బాధ్యతలు అప్పగించబోతున్నారని తెలుస్తోంది. ఒకవైపు కోలీవుడ్‌లో రజనీకాంత్, విజయ్, కమల్ హాసన్ లాంటి స్టార్ల సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు టాలీవుడ్‌లోని బడా ప్రాజెక్టులన్నింటినీ అనిరుధ్ లైన్‌లో పెట్టడం చూస్తుంటే, రూ.25 కోట్లా రెమ్యూనరేషన్ సంగతి పక్కన పెడితే రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఈ రాక్‌స్టార్ మ్యూజిక్ విధ్వంసం మాత్రం వేరే రేంజ్‌లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version