
Champion : ‘ఛాంపియన్’ నుంచి ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటూ భారీ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ‘గిర గిర’ సాంగ్ అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండ్ అవుతుండగా, భావోద్వేగంగా ఆకట్టుకున్న రెండో సింగిల్ ‘సల్లంగుడాలే’ కూడా అద్భుతమైన స్పందనను అందుకుంది. రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ కలిసి స్వప్న ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జె మేయర్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
తాజాగా మూడో సింగిల్ ను విడుదల చేశారు మేకర్స్. ‘ఐ యామ్ ఎ ఛాంపియన్’ అంటూ సాగే ఈ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంతతో రిలీజ్ చేయించారు. భారీ సెట్‌పై, అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కిన ఈ పాట ఎనర్జిటిక్ కంపోజిషన్, బలమైన రిథమ్‌తో శ్రోతలను ఆకట్టుకుంటోంది. కేకే సాహిత్యం పాటకు బలం చేకూరుస్తే, పి. జయరామ్, రమ్య బెహరా తమ ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాట ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.
ఇక డాన్స్ ఫ్లోర్‌పై రోషన్ అదరగొట్టాడు. జాజ్ బీట్స్‌కు తగ్గట్లుగా అతని బాడీ లాంగ్వేజ్, షార్ప్ అండ్ గ్రేస్‌ఫుల్ మూవ్‌మెంట్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అవంతిక కూడా అదే ఎనర్జీతో కనిపించగా, వారి మధ్య కెమిస్ట్రీ తెరపై ప్రత్యేకంగా నిలిచింది. పోనీ వర్మ కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రధాన హైలైట్‌గా నిలవగా.. స్టైలిష్ హుక్ స్టెప్ తో పాటు డైనమిక్ డాన్స్ మూవ్స్ తో సాంగ్ ను మరో లెవల్ కు తీసుకెళ్లారు. ఈ చిత్రంలో నందమూరి కల్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఛాంపియన్’ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
