
Thaman: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ అనగానే టక్కున గుర్తొచ్చే సినిమా ‘వాల్తేరు వీరయ్య’. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించిన ఈ క్రేజీ కాంబో.. ఇప్పుడు మరోసారి రిపీట్ అవుతుండటంతో మెగా అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా విజయవంతంగా పూర్తయింది. తాజాగా ఈ చిత్రం గురించి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక భారీ అప్‌డేట్ రాబోతున్నట్లు తమన్ మెగా ఫ్యాన్స్‌కి హింట్ ఇచ్చారు. “ఎంతైనా ఊహించుకోండి.. ఆగస్టు 22న దద్దరిల్లడం ఖాయం” అనే రేంజ్‌లో ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. చిరు బర్త్‌డే స్పెషల్‌గా ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఎలాగైనా రాబోయే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దానికి తగ్గట్లుగానే షూటింగ్ షెడ్యూల్స్ కూడా శరవేగంగా ప్లాన్ చేస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో, ఈ కాంబోపై ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
Enthaaaainnnaaa oooichhukondiiii !! AUGUST 22 ND https://t.co/eTy9l4GG4c
— thaman S (@MusicThaman) July 13, 2026
