
Chiranjeevi Venkatesh : మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న మోస్ట్ అవైట్‌డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, అలాగే చార్ట్ బస్టర్ సాంగ్ ‘మీసాల పిల్ల’ 72 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సినిమాపై హైప్ పెంచింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మరో హైలైట్ ఏంటంటే విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో మెగాస్టార్‌తో స్క్రీన్ షేర్ చేయడం. తాజాగా హైదరాబాద్‌లో భారీ సెట్‌లో ఇద్దరు స్టార్‌లపై స్టైలిష్ మాస్ డ్యాన్స్ నంబర్‌ను చిత్రీకరిస్తూ మేకర్స్ షూటింగ్‌ను ప్రారంభించారు. వెంకటేష్, చిరుతో కలిసి స్టైలిష్ మాస్ స్టెప్స్ వేయనున్నారన్న వార్తతో ఫ్యాన్స్ లో హైప్ ఆల్ టైమ్ హైకి చేరుకుంది.
ఈ మాస్ డ్యాన్స్ నంబర్ కోసం సెట్‌ను కలర్‌ఫుల్ కార్నివాల్‌లా డిజైన్ చేయగా, చిరంజీవి–వెంకటేష్ కెమిస్ట్రీ, ఎనర్జీ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేయనున్న సాంగ్‌గా కనిపిస్తోంది. భీమ్స్ సిసిరోలియో ఎనర్జిటిక్ బీట్స్‌తో కంపోజ్ చేసిన ఈ సాంగ్‌లో 500 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొనడం విశేషం. ఈ గ్రాండ్ సెలబ్రేషన్ సాంగ్‌కు పొలకి విజయ్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఇక త్వరలోనే చిరు–నయనతారలపై కేరళలో చిత్రీకరించిన మెలోడీ సాంగ్ విడుదల కానుంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి, తమ్మిరాజు, ఎఎస్ ప్రకాష్ వంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.
