Coolie : సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’ ట్రైలర్ రిలీజ్ అయింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆయన సృష్టిస్తున్న లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో మరో కీలక భాగంగా నిలవబోతోంది. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కలానిధి మారన్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌లో కింగ్ నాగార్జున పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించగా, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మరియు ఉపేంద్ర కూడా కీలక పాత్రల్లో మెప్పించనున్నారు.
ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు, పాటలు (‘చికిటు’, ‘మోనికా’, ‘పవర్ హౌస్’) సినిమాపై భారీ అంచనాలను రేపాయి. తాజాగా వచ్చిన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచింది. ట్రైలర్ ప్రారంభం నాగార్జున శక్తివంతమైన డైలాగ్ “ఒకడు పుట్టగానే వాడు ఎవడి చేతిలో చావాలో తలమీద రాసిపెట్టి ఉంటుంది” తో మొదలై, అతని కొత్త లుక్, కేరక్టర్ డిజైన్ ప్రేక్షకుల్లో గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
ఇక రజనీకాంత్ దేవా పాత్రలో మాస్ ఎంట్రీ ఇవ్వడం ట్రైలర్‌కి హైలైట్‌గా మారింది. “అడుగు పెడితే విజలు మోగులే” అనే థ్రిల్లింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నడుమ రజనీకాంత్ స్వాగ్, యాక్షన్ సీక్వెన్స్‌లు, డైలాగులు పూర్తిగా గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. అమీర్ ఖాన్, ఉపేంద్ర సర్‌ప్రైజ్ ఎంట్రీలు కథలో ఆసక్తిని రెట్టింపు చేశాయి. శ్రుతీ హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ వంటి నటుల పాత్రలు కూడా కొత్త కుతూహలాన్ని రేపుతున్నాయి.
టెక్నికల్ వైపు చూస్తే, అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ ఇచ్చింది. గిరీష్ గంగాధరన్ కెమెరా పనితనం విజువల్స్‌ను గ్రాండియర్ లుక్‌తో మలిచింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ విలువలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉన్నాయనే విషయం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి భారీ క్రేజ్ నెలకొంది. ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్‌గా విడుదల చేయనుంది.
మొత్తానికి, ‘కూలీ’ ట్రైలర్ లోకేష్ కనగరాజ్ టేకింగ్, రజనీకాంత్ మాస్ స్వాగ్, నాగార్జున పవర్‌ఫుల్ ప్రెజెన్స్, అమీర్ ఖాన్ సర్‌ప్రైజ్ ఫ్యాక్టర్ అన్ని కలిసిపోయి సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రపంచవ్యాప్తంగా 2025 ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ కానుంది.

