Site icon TeluguMirchi.com

Dada: కాకినాడలో ‘దాదా’ బిగ్గెస్ట్ క్లైమాక్స్ ఫైట్!

DADA

Dada: నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘దాదా’. వెంకట సతీశ్ కిలారు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అదిరిపోయే ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న మంచు మనోజ్, బాలయ్యల మధ్య నడిచే అదిరిపోయే క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్‌కు రంగం సిద్ధమైంది.

ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్, తదుపరి షెడ్యూల్ కోసం కాకినాడ వెళ్లనుంది. నవంబర్ మొదటి వారం నుంచే ఈ కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఇందులో భాగంగా బాలయ్య, మంచు మనోజ్ మధ్య వచ్చే భారీ క్లైమాక్స్ ఫైట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నట్లు టాక్. పవర్‌ఫుల్ విలనిజంతో మంచు మనోజ్, రౌద్ర రూపంలో బాలయ్య తలపడే ఈ సీక్వెన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని తెలుస్తోంది.

ముంబై బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ పక్కా గ్యాంగ్‌స్టర్ కథలో బాలకృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా, అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానున్న ‘దాదా’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version