
యువతలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ‘డెలులు’ అనే పదాన్నే టైటిల్‌గా పెట్టుకుని తెరకెక్కుతున్న చిత్రం ‘డెలులు’. ప్రీతం కస్తూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై సంకీర్త్ కొండ నిర్మిస్తున్నారు. విజయ్ రాజ్‌కుమార్ కథ, అదనపు సంభాషణలు అందించగా.. రెష్మిత్ ఎస్. కౌశిక స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాశారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 1 నిమిషం 32 సెకండ్ల నిడివి ఉన్న టీజర్ ‘బ్రేకప్ దేవా’ అనే డైలాగ్‌తో ప్రారంభమై ఆద్యంతం ఫన్, కామెడీ సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది.
‘ఆడదానివైన నువ్వు.. చీప్‌గా ఓ మగాడి కోసం మారతావా.. సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా నీకు’, ‘నువేమైనా ఫాదర్ ఆఫ్ ఇండియానా?’, ‘నువ్వు అత్తాపూర్‌కు రారా.. నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా’ వంటి డైలాగ్స్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి. ఓ ఇంటి నేపథ్యంలో జరిగే సరదా సంఘటనలు, పాత్రల మధ్య కెమిస్ట్రీ, కామెడీ ట్రాక్‌లు టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా మారాయి. ఫన్‌తో పాటు యువతను ఆకట్టుకునే ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌కు మంచి స్పందన రాగా.. టీజర్‌తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
జై రాజ్ నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. హరికృష్ణ కురపాటి ఎడిటర్‌గా, ఆది చెబ్రోలు సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. విజయ్ రాజ్‌కుమార్, వేణి రావు, అఖిల్ జాక్సన్, సాయి ప్రసన్న, శ్రీ రామ మండవ, అభినయ్ తుల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొత్తంగా విభిన్నమైన టైటిల్, ఫన్ ఎలిమెంట్స్, కామెడీ డైలాగ్స్‌తో ‘డెలులు’ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యువతను టార్గెట్ చేసే కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాకు ప్లస్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి థియేటర్లలో ‘డెలులు’ ఏ స్థాయిలో నవ్వులు పూయిస్తుందో చూడాలి.
