Site icon TeluguMirchi.com

Feel Good Movie: ‘ఫీల్ గుడ్’ నుంచి కొత్త పాట.. ‘మమ్మా మియా’ లిరికల్ వచ్చేసింది!

Feel Good Movie

Feel Good Movie: రొమాంటిక్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ మూవీ ‘ఫీల్ గుడ్’ నుంచి మేకర్స్ తాజాగా ఓ కొత్త పాటను రిలీజ్ చేశారు. ‘మమ్మా మియా’ అంటూ సాగే ఈ పూర్తి లిరికల్ సాంగ్‌ను బయటకు వదిలారు. హీరో సుచిత్, హీరోయిన్ అదితి త్రిపాఠి మధ్య సాగే లవ్ ట్రాక్‌ను బేస్ చేసుకుని ఈ పాటను రెడీ చేశారు.

ఈ తరం కుర్రాళ్లు రెగ్యులర్‌గా వాడుకునే ‘వైబ్’, ‘సింక్’, ‘ట్రెండ్’, ‘హైప్’ లాంటి పదాలతో లిరిక్స్ రాశారు. లవ్‌లో ఉండే సరదా, స్నేహం, చిలిపి అల్లరిని చూపిస్తూ శాండిల్య పిసపాటి దీనికి మ్యూజిక్ ఇచ్చారు. కడలి సత్యనారాయణ రాసిన ఈ పాటను తుషార నిలయ, శాండిల్య పిసపాటి కలిసి పాడారు. హీరో హీరోయిన్ల జోడీ చూడటానికి ఫ్రెష్‌గా కనిపిస్తోంది.

విశ్వరూప ఫిల్మ్స్ బ్యానర్‌పై హీరో సుచిత్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దయానంద్ కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ బాధ్యతలు చూసుకుంటున్నారు. సినిమాలో సుచిత్, అదితిలతో పాటు రావూరి ప్రియాంక, లిఖిత్, రణధీర్ వాసుదేవ్, సాయిఫణి, దివ్య మోహన్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు వచ్చిందని, త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని టీమ్ చెబుతోంది.

Exit mobile version