Site icon TeluguMirchi.com

Killer Glimpse : ‘కిల్లర్’ గ్లింప్స్ రిలీజ్.. అదరగొట్టిన జగతి మేడమ్


Killer Glimpse : గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడమ్ గా అలరించిన జ్యోతి రాయ్ ‘కిల్లర్’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. గతంలో శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ చిత్రాలకు దర్శకత్వం వహించిన పూర్వజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా, హీరోగా కూడా నటిస్తున్నాడు. ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థలతో కలిసి థింక్ సినిమా బ్యానర్‌పై పూర్వజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేసారు.

మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో ఎలిమెంట్స్‌తో కూడిన గ్లింప్స్ ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా సాగింది. ప్రాచీన వైమానిక శాస్త్రంలోని మేధస్సు రహస్యాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో జ్యోతి రాయ్ సూపర్ షీ క్యారెక్టర్‌లో రెండు భిన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంది. జ్యోతి రాయ్‌ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలవగా, గ్లింప్స్ చివర్లో “మొదలెడదామా?” అంటూ హీరో పూర్వజ్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇకపోతే గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడమ్ పాత్రతో అందరినీ ఆకట్టుకున్న జ్యోతి రాయ్ ఈ చిత్రంలో గ్లామర్ తో పాటు స్టైలిష్ లుక్ లో అదరగొట్టేసింది. ఈ చిత్రంలో పూర్వజ్, జ్యోతి రాయ్ లతో పాటు విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ తుది దశలో ఉన్న ఈ హై-టెక్ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version