
Hansika Motwani: ప్రముఖ నటి హన్సిక మోత్వానీ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలకు మరింత ఊపునిచ్చే నిర్ణయం తీసుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి భర్త సోహైల్ కతూరియాతో ఉన్న పెళ్లి ఫోటోలను తొలగించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారన్న ప్రచారం మళ్లీ ఊపందుకుంది. హన్సిక, తన సుదీర్ఘకాల ప్రియుడు సోహైల్‌తో 2022 డిసెంబర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.
ఆ వేడుకను ‘లవ్ షాదీ డ్రామా’ పేరుతో డాక్యుమెంటరీ సిరీస్‌గా కూడా విడుదల చేశారు. కానీ ఇటీవల వీరి మధ్య విభేదాలు తలెత్తాయని, విడిగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్లపై సోహైల్ స్పందించి వాటిని ఖండించినా, హన్సిక మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు ఆమె సోషల్ మీడియా నుంచి పెళ్లి ఫోటోలను తొలగించడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఇక కెరీర్ విషయానికి వస్తే, హన్సిక తన సినిమాలపై దృష్టి పెట్టారు. ఇటీవల ‘గార్డియన్’ సినిమాలో నటించిన ఆమె, ప్రస్తుతం ‘శ్రీ గాంధారి’ అనే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు.
