Site icon TeluguMirchi.com

Hanumat Sundarakanda: ఇండియన్ యానిమేషన్ హిస్టరీలోనే మోస్ట్ పవర్‌ఫుల్ ప్రాజెక్ట్.. విజువల్ వండర్‌గా ‘సుందరకాండ’!

Adhika masa purnima

Hanumat Sundarakanda: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ స్థాయిని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రెడీ అవుతుంది. మన ఇతిహాసాల్లోని అత్యంత పవిత్రమైన ఘట్టం ఆధారంగా ‘హనుమత్ సుందరకాండ’ (#HanumatSundarakanda) అనే యానిమేషన్ చిత్రాన్ని మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇండియన్ యానిమేషన్ రంగంలో ఇదొక సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ చిత్రాన్ని వరల్డ్ క్లాస్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, నెక్స్ట్ జనరేషన్ యానిమేషన్, అత్యాధునిక విఎఫ్ఎక్స్ హంగులతో అంతర్జాతీయ స్థాయిలో వెండితెరపై పునఃసృష్టి చేయనున్నారు. ఐంద్రి క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అరుణ్ కుమార్ రాపోలు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. నిశ్చిత సేతు, హరినాథ్ దేవర సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఎ థియరమ్ స్టూడియోస్ ఈ విజువల్ వండర్‌ను స్క్రీన్‌పైకి తీసుకురావడంలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

సాధారణంగా హాలీవుడ్ చిత్రాల్లో కనిపించే హై-ఎండ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఈ సినిమా కోసం ఉపయోగించబోతుండటం విశేషం. సుందరకాండలోని అద్భుత ఘట్టాలను, ఆంజనేయుడి వీరత్వాన్ని ఇప్పటివరకు ఎన్నడూ చూడని రీతిలో, విజువల్ ట్రీట్‌లా అందించడమే లక్ష్యంగా డైరెక్టర్ అరుణ్ కుమార్ ఈ స్క్రిప్ట్‌ను రెడీ చేశారని చెబుతున్నారు. నెక్స్ట్-జెన్ యానిమేషన్ టెక్నిక్స్ ఉపయోగించనుండటంతో పిల్లల నుంచే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారతీయ ఇతిహాసాల గొప్పతనాన్ని గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version