Site icon TeluguMirchi.com

HHVM :థియేటర్లలో U/A… ప్రైమ్‌లో మాత్రం A..? హరి హర వీరమల్లు’ సస్పెన్స్..!

Hhvm

HHVM : థియేటర్లలో విడుదలై నెల రోజులకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ ఓటీటీలో స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ వారమే సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. జూలై 24న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం, ఆగస్టు 20వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. అయితే మొదట్లో ఐదు భాషల్లో థియేటర్లలో రిలీజ్ అయినప్పటికీ, ప్రైమ్‌లో మాత్రం ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మాత్రమే చూడొచ్చు. హిందీ వెర్షన్ మరో నెల తర్వాత విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ సినిమాకు థియేటర్లలో విడుదల సమయంలో సెన్సార్ బోర్డు యూ/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. కానీ ఓటీటీ రిలీజ్ పోస్టర్‌లో మాత్రం కుడి మూలన ‘ఏ’ సర్టిఫికేట్ కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో బోల్డ్ సన్నివేశాలు లేదా అధిక రక్తపాతం లేకపోయినా, ఎందుకు ‘ఏ’ సర్టిఫికేట్ చూపించారు? అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించగా, మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై దయాకర్ రావు నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి, నిర్మాత ఏఎం రత్నం స్క్రిప్ట్ డెవలప్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా, బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో శక్తివంతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్, సునీల్, సత్యరాజ్, రఘుబాబు, తనికెళ్ళ భరణి తదితరులు కనిపించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు.

Exit mobile version