
Mrunal – Rishabh: సోషల్ మీడియాలో ఎవరు, ఎప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతారో ఎవరికీ అంతుపట్టదు. ప్రస్తుతం అలాంటి ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్, టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారారు. దీనికి కారణం వారిద్దరూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో కావడమే. ఈ చిన్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి నెట్టింట మొదలైంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. రిషభ్ పంత్ తన సిస్టర్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న రెండో మహిళ మృణాల్ ఠాకూర్ అని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ మ్యూచువల్ ఫాలో వెనుక అసలు కారణమేంటన్న ఆసక్తి ఇప్పుడు నెట్టింట మరింత పెరిగింది. అయితే ఈ ప్రచారానికి సంబంధించి ఇప్పటివరకు మృణాల్ ఠాకూర్ గానీ, రిషభ్ పంత్ గానీ స్పందించలేదు. ప్రస్తుతం వారిద్దరూ ఒకరినొకరు ఫాలో చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో కావడాన్ని ఆధారంగా చేసుకుని వారి వ్యక్తిగత సంబంధాలపై కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని మరికొందరు నెట్టిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో మృణాల్ – ధనుష్‌ల గురించి వైరల్ అయిన రూమర్స్ లాగానే ఇవి కూడా రూమర్స్ అని అంటున్నారు. వీరి మధ్య అసలేం జరుగుతుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే అంటూ వారి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
