
Mythri Ravi: తమిళ స్టార్ హీరో కార్తీ, దర్శకుడు పి.ఎస్.మిత్రన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సర్దార్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కార్తీ, ఎస్.జే.సూర్య, మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై.రవి శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సర్దార్’ ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందో అందరికీ తెలుసని, ఆ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ‘సర్దార్ 2’ ఉంటుందని రవి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన కార్తీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ.. తన దృష్టిలో బెస్ట్ పాన్-సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ కార్తీనే అని అన్నారు. ‘‘కార్తీకి అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు ఉంది. ఆయనకు ఉన్న టాలెంట్, ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ చాలా ప్రత్యేకమైనవి. ఆయన ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తే అభిమానులు మరింత సంతోషిస్తారు’’ అని పేర్కొన్నారు. కార్తీ నటించిన ‘ఖైదీ’, ‘ఊపిరి’, వంటి చిత్రాలను రవి శంకర్ గుర్తుచేశారు. అలాగే తమిళ చిత్ర పరిశ్రమలో వచ్చిన ‘ఖుషి’, ‘భారతీయుడు’, ‘జీన్స్’, ‘రోబో’, ‘అసురన్’ వంటి సినిమాలను ప్రస్తావిస్తూ.. మంచి కంటెంట్‌ను రీమేక్ చేయడం కంటే ఒరిజినల్ సినిమాలను డబ్ చేసి విడుదల చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. రెండు భాషల సంస్కృతులను బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో అసలు కంటెంట్‌ను మార్చి పాడు చేయొద్దని సూచించారు.
కార్తీక్ సార్ ఇరుము డైరెక్టర్ శివ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అలాగే ఎస్జే సూర్య సార్ మాకు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో చేయాలి అది కూడా దో మిస్ అయింది. అలాగే ఆ మాలవిక మోహనన్ మేము, విజయ్ దేవరకొండ కలిసి చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా ఆగిపోయింది. ఇదంతా మాకేదో బ్యాడ్ లక్ లాగా ఉంది. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ గ్రేట్ టాలెంట్‌తో ఉన్నారు. మైత్రి పుట్టినా టైంలో ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చిందిమా బోయిపాటి శ్రీను గారికే. అయితే ఆయనతో సినిమా మిస్ అయింది. వీళ్లందరితో సినిమా చేయడానికి మళ్ళీ ప్రయత్నం ఉదృతం చేసి ఎట్టి పరిస్థితిల్లో సినిమా చేసి సాధించి తీరుతాం అన్నారు. ఫైనల్‌గా ‘సర్దార్ 2’ చిత్రబృందానికి రవి శంకర్ శుభాకాంక్షలు తెలిపారు. సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.
