
Su From So : కన్నడలో భారీ విజయాన్ని సాధించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘సు ఫ్రమ్ సో’ ఇప్పుడు తెలుగులోనూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. హాస్యంతో నిండిన ఈ ఎంటర్‌టైనర్‌కి జేపీ తుమినాడ్ దర్శకత్వం వహించగా, మైత్రీ మూవీ మేకర్స్ ఆగస్ట్ 8న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. జూలై 25 న కన్నడలో రిలీజై రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను ఈరోజు విడుదల చేయనున్నారు. షనీల్ గౌతమ్, జేపీ తుమినాడ్, సంధ్య అరకెరె, ప్రకాష్ తుమినాడు, దీపక్ రాయ్ పనాజే, మైమ్ రాందాస్ ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ చిత్రాన్ని శశిధర్ శెట్టి బరోడా, రవి రాయ్ కలసా, రాజ్ బి శెట్టి నిర్మించగా, కన్నడలో విడుదలైన సమయంలోనే మంచి ప్రశంసలు అందుకుంది. ఎస్. చంద్రశేఖరన్ అందించిన సినిమాటోగ్రఫీ, సుమేధ్ కె సంగీతం, సందీప్ తులసీదాస్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చాయి. పర్ఫెక్ట్ హ్యూమర్, రిఫ్రెషింగ్ నరేషన్, ఆసక్తికరమైన పాత్రల సమ్మిళితంతో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు నవ్వుల పండుగను అందించబోతోంది.
NEXT LEVEL LAUGH RIOT AWAITS💥💥
The Recent SENSATION & Kannada's BIGGEST BLOCKBUSTER #SuFromSo is now coming to entertain the Telugu audience on August 8th ❤🔥#SuFromSoTelugu trailer out tomorrow.
Grand release across the Telugu States by @MythriRelease ✨@RajbShettyOMK… pic.twitter.com/nXddqT56D2
— Mythri Movie Makers (@MythriOfficial) August 3, 2025
