
NC24 : థండేల్ సూపర్ హిట్ తర్వాత జోష్ మీదున్న నాగ చైతన్య, విరూపాక్ష ఫేం కార్తిక్ దండుతో కలిసి ఓ మైథికల్ థ్రిల్లర్ NC24 కోసం పనిచేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని బివిఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ కలిసి నిర్మిస్తుండగా, బాపినీడు సమర్పిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ను పూర్తిచేసిన చిత్రబృందం, అందిన రషెస్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు హైదరాబాద్‌లో నెలరోజుల పాటు జరుగనున్న రెండో షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఇందులో నాగ చైతన్యతో పాటు ఇతర పరిశ్రమల నుండి కీలక నటీనటులు పాల్గొననున్నారు. షూటింగ్ మూడు ప్రధాన లొకేషన్లలో జరుగుతుండగా, టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకి పనిచేస్తున్నారు.
తాజాగా విడుదలైన పోస్టర్‌లో నాగ చైతన్య ఒక చేతిలో పికాక్స్, మరో చేతిలో జ్యూట్ త్రాడు పట్టుకొని కనిపిస్తుండగా, “ఒక అడుగు లోతుగా.. ఒక ఊపిరి దగ్గరగా” అనే పదాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ చిత్రంలో నాగ చైతన్య ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని, ఇది అతని కెరీర్‌లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపుదిద్దుకుంటోందని చెబుతున్నారు. ముందు విడుదలైన “NC24 – The Excavation Begins” కాన్సెప్ట్ వీడియోకి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రానికి అజనీష్ బి లోకనాథ్ సంగీతం, రఘుల్ ధర్మణ్ సినిమాటోగ్రఫీ, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్, నవి నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టైటిల్ మరియు పూర్తి తారాగణం వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
YUVASAMRAT is back in action ❤️🔥❤️🔥
The second schedule of #NC24 begins in Hyderabad and will be shot across three different locations💥
It’s going to be an adrenaline-charged ride 🔥🔥@chay_akkineni @karthikdandu86 @BvsnP @aryasukku @AJANEESHB #RagulDharuman @NavinNooli… pic.twitter.com/myWMmH9LtI
— SVCC (@SVCCofficial) July 4, 2025
