
The Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. సెప్టెంబర్ 23న ప్రీమియర్స్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సెప్టెంబర్ 8న నార్త్ అమెరికాలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన తొలి 15 నిమిషాల్లోనే $7,250 విలువైన టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. ఆ తర్వాత బుకింగ్స్ మరింత వేగం పుంజుకుని 172 షోలకు 1,295 టికెట్లు అమ్ముడవగా.. $55,000కు పైగా వసూళ్లు నమోదైనట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
నార్త్ అమెరికాలో ముఖ్యంగా టెక్సాస్ లొకేషన్లలో ‘ది ప్యారడైజ్’కు సూపర్ క్రేజ్ కనిపిస్తోంది. డల్లాస్‌లోని XD స్క్రీనింగ్స్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని థియేటర్ చైన్లు బుకింగ్స్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతుండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ రిలీజ్‌ను ప్రత్యంగిరా సినిమాస్ నిర్వహిస్తోంది. ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో ఈ చిత్రాన్ని నార్త్ అమెరికాలో రిలీజ్ చేయనున్నారు. నాని కెరీర్లోనే భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్లో మంచి బజ్ నెలకొంది. ఇదే జోరులో బుకింగ్స్ కొనసాగితే సెప్టెంబర్ 23న ప్రీమియర్స్‌తో ‘ది ప్యారడైజ్’ నార్త్ అమెరికాలో భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.














