Nani-Saipallavi : ప్రేమకథలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్‌తో కెరీర్‌ను మొదలుపెట్టిన నాని, అలా పక్కింటి అబ్బాయిగా పేరు సంపాదించి నేచురల్ స్టార్‌గా మారిపోయాడు. అయితే ఒకే రకమైన పాత్రల్లో కాకుండా, విభిన్నత చూపించాలన్న ఉద్దేశ్యంతో ‘హిట్ 3’లో కొత్తగా కనిపించి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’లో నటిస్తున్న నాని, మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాటిలో ఒకటి శేఖర్ కమ్ములతోనని టాక్. ‘కుబేర’ సక్సెస్‌తో ఊపుమీదున్న శేఖర్ కమ్ముల – నాని కాంబినేషన్ మొదటిసారి కుదురుతుండటంతో అంచనాలు పెరిగాయి.
ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవిని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఈ వార్త నిజమైతే, నాని–సాయిపల్లవి జంట ‘ఎంసీఏ’, ‘శ్యామ్ సింగరాయ్’ తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనబడనుంది. అంతేకాదు, ఈ ఇద్దరి జంట అప్పటికే హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నందున మళ్లీ కలిసే అవకాశం ఫ్యాన్స్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. శేఖర్ కమ్ములకి కూడా సాయిపల్లవి ఫేవరెట్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఆమెతో ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ వంటి సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ముఖ్యంగా ‘ఫిదా’లో ఆమె తెలంగాణ యాసలో పలికిన డైలాగులు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు నాని-శేఖర్ కమ్ముల-సాయిపల్లవి కాంబో ఒకేసారి రాబోతుందన్న వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే, సాయిపల్లవి తాజాగా నాగచైతన్యతో చేసిన ‘తండేల్’ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ’లో సీత పాత్రలో నటిస్తోంది. రణ్‌బీర్ కపూర్, యష్‌లతో కలిసి నటిస్తున్న ఈ సినిమా సుమారు రూ.4వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా, 2026–27లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

