
The Paradise : నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise)పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దసరాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి తన SLV Cinemas బ్యానర్‌పై ఎలాంటి రాజీ లేకుండా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ‘దసరా’ తర్వాత నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆ అంచనాలను మరింత పెంచాయి.
ఇప్పుడు నాని పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ సిద్ధమైంది. ఫిబ్రవరి 24న ‘ఆయా షేర్’ అనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నాని ఇంట్రడక్షన్ సాంగ్‌గా వస్తున్న ఈ పాటను భారీ సెట్‌లో వందలాది డ్యాన్సర్లతో గ్రాండ్‌గా చిత్రీకరించారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మాస్ బీట్‌కు Sudhan Master డిజైన్ చేసిన స్టెప్పులు మరింత హైలైట్ కానున్నాయి. ఈ హై వోల్టేజ్ సాంగ్ థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 21న ఈ చిత్రం ఎనిమిది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

