The Paradise : నాని బర్త్‌డే రోజు మాస్ ట్రీట్.. ‘ఆయా షేర్’ రాబోతోంది!

Theparadise
The Paradise : నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise)పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దసరాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి తన SLV Cinemas బ్యానర్‌పై ఎలాంటి రాజీ లేకుండా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ‘దసరా’ తర్వాత నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆ అంచనాలను మరింత పెంచాయి.

Also Read :  Sandeep Reddy Vanga: బాక్సాఫీస్ దగ్గర ‘పెద్ది’ జాతర.. థియేటర్‌లో సినిమా చూసి సందీప్ రెడ్డి వంగా సంచలన రియాక్షన్!

ఇప్పుడు నాని పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ సిద్ధమైంది. ఫిబ్రవరి 24న ‘ఆయా షేర్’ అనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నాని ఇంట్రడక్షన్ సాంగ్‌గా వస్తున్న ఈ పాటను భారీ సెట్‌లో వందలాది డ్యాన్సర్లతో గ్రాండ్‌గా చిత్రీకరించారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మాస్ బీట్‌కు Sudhan Master డిజైన్ చేసిన స్టెప్పులు మరింత హైలైట్ కానున్నాయి. ఈ హై వోల్టేజ్ సాంగ్ థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 21న ఈ చిత్రం ఎనిమిది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.