Site icon TeluguMirchi.com

The Paradise: నో టికెట్ హైక్.. ఓన్లీ కంటెంట్ డెలివరీ.. రూమర్లపై తేల్చేసిన ‘ది ప్యారడైజ్’ టీమ్!

The Paradise

The Paradise: న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ – ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ హైప్ నెలకొంది. సరిగ్గా ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఒక ప్రచారం తీవ్ర దుమారం రేపింది. సినిమాకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్లను భారీగా పెంచబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీంతో సగటు సినీ ప్రేక్షకులు, అభిమానుల్లో ఆందోళన మొదలైంది. టికెట్ హైక్స్ గురించి నెట్టింట జరుగుతున్న ప్రచారంపై ‘ది ప్యారడైజ్’ చిత్రయూనిట్ స్పందించి అసలు నిజాన్ని బయటపెట్టింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కేవలం పుకార్లేనని తేల్చి చెప్పింది.

ప్రస్తుతానికైతే టికెట్ ధరలను పెంచే ఆలోచన తమకు ఏమాత్రం లేదని నిర్మాణ వర్గాలు స్పష్టం చేశాయి. సినిమా బిజినెస్ వ్యవహారాలు లేదా టికెట్ ప్రైసింగ్ పాలిటిక్స్ కంటే, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించడమే తమ ప్రియార్టి అని టీమ్ తెలిపింది. ప్రస్తుతం యూనిట్ దృష్టంతా నాణ్యమైన ‘కంటెంట్ డెలివరీ’పైనే ఉందని వివరించింది. ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లను విపరీతంగా పెంచేయడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం తగ్గిందనే విమర్శలు సినీ వర్గాల్లో ఉన్నాయి. నాని చిత్రాలకు మొదటి నుంచీ కుటుంబ ప్రేక్షకుల అండ పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో టికెట్ ధరల పెంపు ఆలోచన లేదని మేకర్స్ కుండబద్దలు కొట్టడం ప్రేక్షకులకు, అభిమానులకు పెద్ద ఊరటనిచ్చింది. కంటెంట్‌పై నమ్మకంతో థియేటర్లలో సాధారణ ధరలకే సినిమాను అందించేందుకు టీమ్ మొగ్గుచూపుతుండటం బాక్సాఫీస్ వద్ద సినిమాకు మరింత ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది.

Exit mobile version