
Prabhas – Nag Ashwin : గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన ‘కల్కి 2898 ఏడీ’ జోడీ మళ్లీ కలవబోతోంది. అవును తెలుసు.. ఈ డైరెక్టర్ ఆ హీరో ఈ సినిమా పార్ట్ 2 కోసం కలవబోతున్నారని తెలుసు అనుకుంటున్నారు. అయితే మీరు పొరబడినట్లే.. వాళ్లు కేవలం ‘కల్కి 2’ సినిమా కోసమే కలవడం లేదట. మళ్లీ ఈ కాంబోలో మరొక భారీ ప్రాజెక్ట్ లాక్ అయినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త ఇప్పుడు తెగ హల్‌చల్ చేస్తోంది. వీరిద్దరి ఫస్ట్ కొల్లాబరేషన్ ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాయడంతో, ఈ నయా క్రేజీ కాంబోపై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈసారి నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ జోనర్‌ను పక్కన పెట్టి, పూర్తిగా ఒక భారీ పౌరాణిక గాథను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. హిందూ పురాణాల నేపథ్యంలో నడిచే ఒక పవర్‌ఫుల్ మైథలాజికల్ కథను నాగ్ అశ్విన్ ప్రభాస్ కోసం రెడీ చేశారని, దానికి ప్రభాస్ కూడా ఇంప్రెస్ అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ టైమ్‌లైన్‌కు సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా మారాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రతిష్టాత్మక చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. ఆయన లైనప్‌లో హను రాఘవపూడితో ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’, ‘కల్కి పార్ట్ 2’ సలార్ 2 లైన్‌లో ఉన్నాయి. ఈ బ్యాక్-టు-బ్యాక్ కమిట్మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాతే ప్రభాస్ – నాగ్ అశ్విన్ కొత్త చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
