Site icon TeluguMirchi.com

GD Naidu Release: ‘రాకెట్రీ’ తర్వాత మరో బయోపిక్‌తో మాధవన్.. రేపే ‘జి.డి. నాయుడు’ రిలీజ్‌!

GD Naidu Release

GD Naidu Release: వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న స్టార్ యాక్టర్ ఆర్.మాధవన్ మరో ఆసక్తికరమైన బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, ఆవిష్కర్త గోపాలస్వామి దొరైస్వామి నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘జి.డి.నాయుడు’ (GDN) చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా’, ‘మిరాకిల్ మేన్’, ‘వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూర్’గా పేరొందిన జి.డి.నాయుడు జీవితంలోని స్ఫూర్తిదాయక ఘట్టాలను ఈ చిత్రంలో ఆవిష్కరించారు.

నటుడు, దర్శకుడు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాధవన్ ప్రధాన పాత్రలో నటించగా, సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్, వినయ్ రాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇంతకుముందు ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’లో నంబి నారాయణన్ పాత్రలో తన నటనతో ప్రశంసలు అందుకున్న మాధవన్, ఈ సినిమాలోనూ జి.డి.నాయుడు పాత్ర కోసం పూర్తిగా కొత్త మేకోవర్‌లో కనిపించనున్నారు. విభిన్న గెటప్స్, కాలానుగుణంగా రూపొందించిన సెట్స్, అత్యున్నత నిర్మాణ విలువలు సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలను నెలకొల్పాయి. సంగీత దర్శకుడు గోవింద్ వసంత అందించిన బీజీఎం ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవల విడుదలైన తెలుగు ట్రైలర్‌కు ప్రేక్షకులతో పాటు సినీ విశ్లేషకులు నుంచి విశేష స్పందన లభించింది. ఈ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.

Exit mobile version