Site icon TeluguMirchi.com

Ram Charan : రామ్ చరణ్ అయ్యప్ప మాలపై సోషల్ మీడియా చర్చలు

Ramcharan

Ram Charan : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల ధరిస్తూ భక్తి పథంలో నడుస్తుంటారు. ఈసారి ఆయన మాల వేసుకోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. తాజాగా ఒక ఫోటో బయటకు రావడంతో వివాదం మొదలైంది. ‘పెద్ది’ సినిమా షెడ్యూల్ కోసం రామ్ చరణ్ హెయిర్ స్టైలిస్ట్‌తో పని చేస్తున్నప్పుడు తీసిన ఆ ఫోటోలో ఆయనకు హెయిర్ కట్ చేస్తున్నట్లు కనిపించడంతో, ఇది అయ్యప్ప దీక్ష నియమాలకు విరుద్ధమని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

అదే సమయంలో చిరంజీవి జన్మదిన వేడుకల్లో రామ్ చరణ్ కేక్ కట్ చేయడం, తండ్రి పాదాలను తాకడం జరిగిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కేక్‌లో గుడ్లు వాడితే అది దీక్ష నియమాలకు విరుద్ధమని విమర్శకులు వాదిస్తున్నారు. అయితే రామ్ చరణ్ ఇంతకు ముందు ఎన్నోసార్లు అయ్యప్ప మాల ధరించినా ఇలాంటి వివాదం రాలేదు. కానీ ఈసారి మాత్రం సోషల్ మీడియాలో చర్చలు తీవ్రం అయ్యాయి. అభిమానులు ఆయన భక్తిని సమర్థిస్తుంటే, కొందరు మాత్రం దీక్ష ఆచారాల ఉల్లంఘనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Exit mobile version