Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం ‘పెద్ది’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను స్పోర్ట్స్ డ్రామాగా రూపొందించగా, క్రికెట్, కబడ్డీ, కుస్తీ వంటి స్థానిక ఆటల నేపథ్యంతో కథ సాగనుందని సమాచారం. ఇందులో రామ్ చరణ్ ఓ ‘ఆట కూలీ’ పాత్రలో కనిపించబోతున్నారని ఇండస్ట్రీ టాక్.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చెర్రీ మాసీవ్ గెటప్ అభిమానులను అమితంగా ఆకర్షించింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ‘పెద్ది’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కానుందని, వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 25న ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ ఉంది.
‘ఫస్ట్ షాట్’ పేరుతో విడుదలైన మూవీ గ్లింప్స్ ఇప్పటికే సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌తో వచ్చే పాటలు మరింత పూనకాలు తెప్పిస్తాయని అభిమానులు నమ్ముతున్నారు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 26న, రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది.

