Site icon TeluguMirchi.com

Peddi : బీస్ట్ మోడ్‌లో రామ్ చరణ్ – ‘పెద్ది’ కోసం షాకింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్!

Ramcharan
Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’ కోసం నెవర్ బిఫోర్ అవతార్ లోకి అడుగుపెట్టారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ ను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ షాట్ గ్లింప్స్ తో దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

అయితే చరణ్ ఈ సినిమాలోని పాత్ర కోసం శారీరకంగా పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. జిమ్‌లో త‌నను తాను విపరీతంగా ప్రిపేర్ చేస్తూ, రగ్గ్డ్ లుక్, ముడివేసిన జుట్టు, సాలిడ్ బాడీతో మాస్ బీస్ట్‌గా మారిపోయారు. ఇది కేవలం లుక్ మార్చడం మాత్రమే కాదు, పాత్ర పట్ల తనకున్న డెడికేషన్‌కు నిదర్శనం. ఇప్పటివరకు రామ్ చరణ్ ను ఇలా ఎప్పుడూ చూడలేదంటూ అభిమానులు సోషల్ మీడియాలో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శివ రాజ్‌కుమార్ ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. టెక్నికల్ టీమ్ విషయంలోనూ పెద్ది భారీ అంచనాలు రేపుతోంది – ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు, ఆస్కార్ అవార్డు గ్రహీత మాస్ట్రో ఎ.ఆర్. రెహమాన్ సంగీతం, నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27, 2026న ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

Exit mobile version