
Kothapallilo Okappudu : రానా దగ్గుబాటి కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలకు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తున్నారు. తన స్పిరిట్ మీడియా బ్యానర్ ద్వారా ప్రయోగాత్మక కథలను ప్రోత్సహిస్తూ కొత్త ప్రయత్నాలకు ఆస్కారం కల్పిస్తున్నారు. తాజాగా ఆయన ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ అనే సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహిస్తున్నారు. ‘C/o కంచరపాలెం’ మరియు ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను నిర్మించిన ప్రవీణ, ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.
‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రం ఒక పల్లెటూరి యువకుడి నాస్టాల్జిక్ జర్నీని హాస్యంతో, భావోద్వేగాలతో మిళితం చేస్తూ చూపించనుంది. కథలో ఊహించని మలుపులతో పాటు, లాస్ ఏంజిల్స్‌కు చెందిన అవార్డు విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ అందించిన కొత్త విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. చక్కని పాటలు, డ్యాన్స్ సీక్వెన్సులు, హాస్యభరితమైన ఉపకథలు ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా తయారు చేస్తున్నాయి. త్వరలో థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం తెలుగు సినిమాకు లవ్ లెటర్ లా ఉండబోతోంది.
