418 TheFilm: భయానికి కొత్త నిర్వచనం.. జూలై 31న థియేటర్లలోకి వస్తున్న ‘418’!

418 TheFilm

418 TheFilm: సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న థ్రిల్లర్ చిత్రం ‘418’ రిలీజ్‌కు రెడీ అవుతుంది. “Behind this door lies the beginning of all your fears” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఇప్పటికే సినిమాపై క్యూరియాసిటీ పెంచిన మేకర్స్.. ఈ చిత్రాన్ని 2026 జూలై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్నారు. కీర్తన్న దగౌడ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్, ట్యాగ్‌లైన్ సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. ముఖ్యంగా తలుపు వెనుక దాగి ఉన్న భయానక రహస్యమే కథకు ప్రధాన బలంగా ఉండబోతుందనే సంకేతాలను మేకర్స్ ఇచ్చారు. థ్రిల్లర్, సస్పెన్స్, హారర్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు, ప్రశాంత్ నీల్ సమర్పణలో వస్తున్న చిత్రం కావడంతో ‘418’పై సినీ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. జూలై 31న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.