Site icon TeluguMirchi.com

Rashmika Mandanna: ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నేషనల్ క్రష్.. !

Rashmika Mandanna

Rashmika Mandanna: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఖాతాలో మరో అరుదైన మైలురాయి చేరబోతున్నట్లు తెలుస్తోంది. లెజెండరీ కర్ణాటక సంగీత గాయకురాలు, భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నేషనల్ క్రష్ నటించబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం రష్మిక లుక్ టెస్ట్ కూడా పూర్తి చేసుకుందనే వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో..
‘మళ్ళీ రావా’, ‘జెర్సీ’ వంటి విలక్షణమైన చిత్రాలతో డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారి జీవితం, ఆమె సంగీత ప్రయాణం, ప్రపంచవ్యాప్తంగా ఆమె సాధించిన విజయాల నేపథ్యంతో ఈ సినిమా స్టోరీ ఉండబోతోందని సమాచారం. ఈ పాత్ర కోసం చిత్ర బృందం రష్మికను ఫైనలైజ్ చేసే దిశగా అడుగులు వేస్తోందని జోరుగా ప్రచారం సాగుతుంది.

నిజానికి ఈ బయోపిక్ గురించిన చర్చలు మొదలైనప్పుడు.. సాయి పల్లవి, కన్నడ బ్యూటీ రుక్మిణి వాసంత్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఫైనల్‌గా ఈ ప్రాజెక్ట్‌లో నేషనల్ క్రేజ్ రష్మిక ఫైనల్ చేయాలనే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నారని చెబుతున్నారు. ఈ క్రేజీ బయోపిక్‌పై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే రష్మిక కెరీర్‌లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ కావడం ఖాయం అని చెబుతున్నారు.

Exit mobile version