Atlee: నిర్మాతగా మారిన స్టార్ డైరెక్టర్ అట్లీ.. హీరో ఎవరంటే?

Atlee

Atlee: కోలీవుడ్‌లో ప్రస్తుతం ఒక క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఇప్పుడు నిర్మాతగా మారి ఒక సరికొత్త క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నట్లు టాక్. ఈ మోస్ట్ హ్యాపెనింగ్ ప్రాజెక్ట్‌లో టాలెంటెడ్ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. అట్లీ దగ్గర చాలా కాలంగా వర్క్ చేస్తోన్న ఒక టాలెంటెడ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారట. 2022లో వచ్చిన ‘లవ్ టుడే’ సినిమాతో దర్శకుడిగా, హీరోగా రాత్రికి రాత్రే సౌత్ ఇండియా మొత్తం పాపులర్ అయిపోయారు ప్రదీప్ రంగనాథన్. యూత్‌లో ఆయనకున్న క్రేజ్ చూసి ఇండస్ట్రీ వర్గాలే షాక్ అయ్యాయి. ఆ తర్వాత విడుదలైన ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద వరుసగా మంచి విజయాలను అందుకోవడమే కాకుండా, నటుడిగా తన మార్కెట్‌ను భారీగా పెంచుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న యంగ్ హీరోల్లో ప్రదీప్ ఒకరిగా నిలిచారు.

Also Read :  Slumdog: బాక్సాఫీస్ వద్ద పూరి జగన్నాథ్ వైల్డ్ కమ్‌బ్యాక్.. 'స్లమ్‌డాగ్' టీజర్‌కు ముహూర్తం ఫిక్స్!

స్టార్ డైరెక్టర్‌గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. తన స్వంత బ్యానర్‌పై సరికొత్త కాన్సెప్ట్‌లతో వచ్చే యంగ్ టాలెంట్‌ను, కొత్త తరం నటీనటులను ప్రోత్సహించేందుకు అట్లీ ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రదీప్ రంగనాథన్ మార్క్ కామెడీ, యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌కు అట్లీ ప్రొడక్షన్ వాల్యూస్ తోడైతే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.