Site icon TeluguMirchi.com

Vivek Athreya Movie: 18 ఏళ్ల తర్వాత ఆ కాంబో రిపీట్.. వివేక్ ఆత్రేయ సినిమాలో ఊహించని ట్విస్ట్!

Ravi Teja

Vivek Athreya Movie: ‘ఇరుముడి’తో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన మాస్ మహారాజా రవితేజ, తన తర్వాతి ప్రాజెక్ట్‌‌లను మరింత పక్కా ప్లానింగ్‌తో సెట్ చేసుకుంటున్నారు. విభిన్న స్టోరీలతో మెప్పించే దర్శకుడు వివేక్ ఆత్రేయతో రవితేజ చేయనున్న చిత్రంపై ఇప్పటికే సినీ ప్రియుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో రవితేజను ఢీకొట్టే విలన్ పాత్రలో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి కనిపించబోతున్నారనే వార్త నెట్టింట సంచలనంగా మారింది.

రవితేజ, జేడీ చక్రవర్తి కలసి చివరిసారిగా 2007లో వచ్చిన కల్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘దుబాయ్ శీను’లో సందడి చేశారు. ఆ సినిమాలో ఫ్రెంగ్స్‌గా కనిపించి ఆడిన్స్‌ని కడుపుబ్బా నవ్వించిన వీరిద్దరూ.. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు వార్తలు రావడంతో మాస్ మహారాజా ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. అయితే వివేక్ ఆత్రేయ సినిమాలో వాళ్లిద్దరూ ఫ్రెండ్స్‌గా కాకుండా, ఒకరికొకరు తలపడే పాత్రల్లో కనిపించనున్నారనే టాక్ అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Exit mobile version