
Bhogi: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ మాస్ విశ్వరూపం చూసేందుకు టాలీవుడ్ సిద్ధమవుతోంది. పూర్తి ఫిట్నెస్తో, సరికొత్త అల్ట్రా స్టైలిష్ అవతారంలోకి మారిన శర్వానంద్.. మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోగి’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముహూర్తం ఖరారైంది. మొదట ఆగస్టులోనే రావాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్, పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ కోసం కాస్త లేట్ చేసిన చివరకు నవంబర్ 13న బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోగా, మిగిలి ఉన్న కొద్ది ప్యాచ్ వర్క్‌ను శర్వా త్వరలోనే పూర్తి చేయనున్నారు. ఈ రోజు ఘనంగా జరగనున్న టీజర్ లాంచ్ ఈవెంట్లో సినిమా రిలీజ్ తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. కేవలం టీజర్‌తోనే కాకుండా, రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన వెంటనే థియేట్రికల్, నాన్-థియేట్రికల్ బిజినెస్ డీల్స్‌ను భారీ స్థాయిలో క్లోజ్ చేసేలా నిర్మాత పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్, ఫ్యామిలీ సినిమాలతో మెప్పించిన శర్వానంద్.. ఈ చిత్రంలో ఊరమాస్ యాక్షన్‌తో పాటు అదిరిపోయే ఎమోషనల్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను కట్టిపడేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. సంపత్ నంది మార్క్ మాస్ ఎలివేషన్లు, శర్వా నటన తోడై సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో అందిస్తున్న సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.














