
The Paradise: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన రా అండ్ రస్టిక్ యాక్షన్ ధమాకా ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబో వచ్చిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ థియేటర్స్‌లో అదరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన బాణీలు కీ హైలెట్‌గా నిలిచాయి. అయితే ఈ సినిమాలో ప్రేక్షకుల చేత ఈలలు వేయించాల్సిన ఓ పవర్‌ఫుల్ సాంగ్ థియేట్రికల్ కట్‌లో మిస్సయిందని తాజా ఇంటర్వ్యూలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చెప్పుకొచ్చారు. చివరి నిమిషంలో అనిరుధ్‌పై పడ్డ వర్క్ లోడ్ వల్లే ఈ అద్భుతమైన పాట ఆగిపోయిందని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, గీత రచయిత కాసర్ల శ్యామ్ స్వయంగా వెల్లడించారు.
సినిమాలోని పలు కీలక ఘట్టాల నేపథ్యంపై శ్రీకాంత్ ఓదెల, కాసర్ల శ్యామ్ మనసు విప్పి మాట్లాడారు. “సినిమాలో దేశం కాన్సెప్ట్‌తో సాగే ఆ ఒక్క సాంగ్ గనుక థియేటర్‌లో పడి ఉంటే రచ్చ రంబోలా అయ్యేది. కానీ అనిరుధ్‌కు అప్పటికే విపరీతమైన పని ఒత్తిడి ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ వంటి భారీ ఎపిసోడ్స్‌ను అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దే క్రమంలో ఆయన తీరిక లేకుండా గడిపారు. లైవ్ ఇన్‌స్ట్రుమెంట్ రికార్డింగ్స్ చేయించి, ఫైనల్ మిక్సింగ్ పూర్తి చేయడానికి సమయం చాలకపోవడంతో ఆ పాటను తప్పనిసరి పరిస్థితుల్లో పక్కన పెట్టాల్సి వచ్చింది” అని శ్రీకాంత్ ఓదెల అసలు నిజాన్ని బయటపెట్టారు.
సిల్వర్ స్క్రీన్ పై మిస్సయిన ఈ గీతాన్ని ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు అందించేందుకు శ్రీకాంత్ ఓదెల మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. “ఇటీవలే మా డైరెక్షన్ టీమ్‌తో దీనిపై సుదీర్ఘంగా చర్చించాం. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కోసం అనిరుధ్‌తో మళ్లీ వర్క్ చేయించి, ప్రస్తుతం ఉన్న ఇంగ్లీష్ ట్రాక్ స్థానంలో ఈ హార్డ్ హిట్టింగ్ దేశం పాటను రీప్లేస్ చేయాలని భావిస్తున్నాం. లైవ్ రికార్డింగ్స్‌తో ఓటీటీ రిలీజ్‌కు ఈ సాంగ్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తాం” అని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఒకవేళ నెట్‌ఫ్లిక్స్ కట్‌లో ఈ పాట చేరితే, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సరికొత్త వ్యూవర్‌షిప్ రికార్డులు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది.













