Site icon TeluguMirchi.com

Mass Jathara Trailer : రవితేజ ‘మాస్ జాతర’ ట్రైలర్‌తో మాస్ ఫీస్ట్!

Massjathara
Mass Jathara Trailer : రవితేజ, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తుండగా, రవితేజ–భీమ్స్ కాంబోలో వచ్చిన ‘ధమాకా’ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి రెస్పాన్స్‌ పొందాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

ట్రైలర్‌లో రవితేజ తన ఎనర్జీ, కామెడీ, యాక్షన్‌తో మరోసారి అభిమానులను అలరించాడు. చాలాకాలం తర్వాత ఆయనను పూర్తిగా మాస్ అవతారంలో చూసిన అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమాలో రవితేజ రైల్వే ఎస్సై పాత్రలో కనిపించబోతుండగా, “రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్ ఉంటాయ్.. నేను వచ్చినాక ఒకటే జోన్ – వార్ జోన్” అనే డైలాగ్ ట్రైలర్‌లో హైలైట్‌గా మారింది. ఇక శ్రీలీల శ్రీకాకుళం యాసలో మాట్లాడిన “పళ్లు రాలగొట్టేస్తాను ఏటి అనుకున్నావేటో” అనే డైలాగ్‌తో మంచి మాస్ టచ్ ఇచ్చింది. ఈ సినిమాలో నవీన్ చంద్ర విలన్‌గా కనిపిస్తుండగా, రాజేంద్ర ప్రసాద్, నరేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్, కామెడీ, ఎమోషన్ కలగలిపిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Exit mobile version