
Chethabadi : శ్రీ శారద రమణా క్రియేషన్స్ బ్యానర్‌పై నంద కిషోర్ నిర్మిస్తున్న సినిమా ‘చేతబడి’ను నూతన దర్శకుడు సూర్యాస్ తెరకెక్కిస్తున్నారు. 1953లో గిరిడ అనే గ్రామంలో జరిగిన నిజమైన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యం, బాణామతి విశ్వాసాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పూర్తి హారర్ టచ్‌తో తెరకెక్కిస్తున్నారు.
చేతబడి అనేది 16 వ శతాబ్దంలో మన ఇండియాలో పుట్టిన ఒక కల. రెండు దేశాలు కొట్టుకోవాలన్న రెండు దేశాలు కలవాలన్న.. ఒక బలం బలగంతో ఉండాలి. కానీ ఒక ఈవిల్ ఎనర్జీతో మనిషిని కలవకుండా అతన్ని చంపే విద్యే చేతబడి. అది ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారు. ఇందులో చాలా విభిన్నంగా చూపిస్తున్నాం. మన బాడీలో ప్రతిదానికి ఒక ప్రాణం ఉంటుంది. జుట్టుకు కూడా ఒక ప్రాణం ఉంటుంది. ఆ వెంట్రుకల ఆధారంగానే ఈ సినిమా ఆధారపడి ఉంటుంది. 1953 గిరిడ అనే గ్రామంలో రియల్ గా జరిగిన యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ కథను సిద్ధం చేశాం. సీలేరు అనే గ్రామంలో 200 సంవత్సరాల క్రితం వెదురు బొంగులు చాలా థిక్ గా ఉంటాయి. వర్షం పడినా అవి నేలలోకి దిగవు. అలాంటి మట్టిలో బతికున్న నల్లకోడిని పెట్టి అమావాస్య రోజు బాణామతి చేసే ఘట్టాన్ని అత్యంత భయానకంగా చూపించబోతున్నట్లు దర్శకుడు సూర్యాస్ తెలిపారు.
నిర్మాత నంద కిషోర్ మాట్లాడుతూ, “ఒకానొక కాలంలో బాణామతి భయంతో ప్రజలు తీవ్ర మానసిక, రాజకీయ, సామాజిక సమస్యలు ఎదుర్కొన్నారు. కొంతమంది దాన్ని ఉపయోగించి అమాయకులను మోసం చేశారు. అలాంటి యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమా ద్వారా ప్రజలలో ఉన్న మూఢనమ్మకాలను ప్రశ్నిస్తూ, రియలిస్టిక్ హారర్ కథను ప్రేక్షకులకు అందించబోతున్నాం” అని తెలిపారు.
