OG 2 : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గుట్టుచప్పుడు కాకుండా ‘ఓజీ-2’ 70% వర్క్ ఫినిష్ చేసిన సుజీత్!

OG

OG 2 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే సూపర్ కలెక్షన్స్ సాధించిన చిత్రం ‘ఓజీ’ (OG). ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఓజీ పార్ట్-2 గురించిన క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతుంది. ‘ఓజీ-2’ స్టోరీ లైన్‌ను డైరెక్టర్ సుజీత్ ఇప్పటికే రెడీ చేసి పెట్టుకున్నట్లు సమాచారం. ఈ సీక్వెల్‌కు సంబంధించిన దాదాపు 70 శాతం వర్క్ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ‘ఓజీ’ ఫస్ట్ పార్ట్ షూటింగ్ జరుగుతున్న టైంలోనే, సుజీత్ చాలా ప్లానింగ్‌తో పార్ట్-2 కి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా షూట్ చేసి పక్కన పెట్టేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.

Also Read :  Slumdog: బాక్సాఫీస్ వద్ద పూరి జగన్నాథ్ వైల్డ్ కమ్‌బ్యాక్.. 'స్లమ్‌డాగ్' టీజర్‌కు ముహూర్తం ఫిక్స్!

సుజీత్ వర్క్ స్టైల్ – ప్లానింగ్ చూస్తుంటే.. ఆయన అనుకుంటే ‘ఓజీ-2’ ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకురావడం పెద్ద విషయమేమీ కాదని చెబుతున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్, మేజర్ షూట్ పార్ట్ ఒక కొలిక్కి రావడంతో సీక్వెల్ పట్టాలెక్కడం చాలా ఈజీ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ వార్త బయటికి రావడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు మస్త్ ఖుషీ అవుతున్నారు. ఓజీ పార్ట్-2 పై ఇప్పటి వరకు మేకర్స్ ఎలాంటి అనౌన్స్‌మెంట్ చేయలేదు. అతి త్వరలో ఈ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.