Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో గ్లోబల్ హీరోయిన్.. థియేటర్లు షేక్ అయ్యేలా ‘హై-ఎనర్జీ’ మాస్ సాంగ్!

Dragon

Dragon: ‘దేవర’ వంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల లైన్అప్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అందులోనూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘#Dragon’ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ – డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ పాన్-ఇండియా మూవీ గురించి రోజుకో క్రేజీ బజ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫిలిం నగర్ వర్గాల్లో ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా కంటెంట్ – కాస్టింగ్ గురించి ఒక సాలిడ్ న్యూస్ బయటికి వచ్చింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఒక హై-ఎనర్జీ స్పెషల్ సాంగ్‌తో మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించబోతున్నారట.

Also Read :  Priyamani: రామానాయుడు స్టూడియోస్ గోడపై నా ఫొటో చూడాలనుకున్నా!

ఈ స్పెషల్ సాంగ్ కేవలం డాన్స్ నెంబర్ లానే కాకుండా సినిమా కథలో భాగంగా వచ్చే ఒక కీలకమైన సీక్వెన్స్‌గా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ డాన్స్ స్టెప్పులకు, స్క్రీన్ ప్రెజెన్స్‌కు థియేటర్లలో మాస్ రెస్పాన్స్ రావడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాలో నటీనటుల ఎంపిక కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోందని సమాచారం. ఈ చిత్రంలోని ఒక అత్యంత కీలకమైన రోల్ కోసం ఒక గ్లోబల్ స్టార్ హీరోయిన్‌ను పరిశీలిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు. దీనితో పాటు ‘హృదయం’ ఫేమ్ మలయాళ టాలెంటెడ్ నటి దర్శన రాజేంద్రన్ కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన, వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.