Site icon TeluguMirchi.com

Ritika Nayak: రితికా నాయక్‌కు బంపర్ క్రేజ్.. టాలీవుడ్‌లో ఇప్పుడు ఈ బ్యూటీ హవానే!

Cinema

Ritika Nayak: తెలుగు చిత్రసీమలో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ హీరోయిన్ రితికా నాయక్. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా విడుదలైన ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ భామకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో రితికా నాయక్ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ ఆకట్టుకుంది. ఆమె గ్లామర్‌తో పాటు నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా స్క్రీన్‌పై ఆమె కనిపించే విధానం, పాత్రలో చూపించిన వేరియేషన్ ప్రేక్షకులను మెప్పిస్తోంది.

ఇప్పటికే ‘మిరాయ్’ వంటి సినిమాలతో విజయాలను అందుకున్న రితికా నాయక్.. వరుస హిట్లతో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది. దీంతో టాలీవుడ్ నిర్మాతలు ఆమెను తమ సినిమాలకు కలిసొచ్చే హీరోయిన్‌గా భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు కొత్త హీరోయిన్ల విషయంలో సెంటిమెంట్లు ఉండేవి. కానీ రితికా నాయక్ విషయంలో మాత్రం ఆమె అడుగుపెట్టిన ప్రాజెక్టులకు మంచి ఫలితాలు వస్తుండటంతో ‘లక్కీ చార్మ్’ అనే టాక్ వినిపిస్తోంది. ఆమెను ఐరన్ లెగ్‌గా కాకుండా గోల్డెన్ లెగ్‌గా ఇండస్ట్రీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ప్రస్తుతం రితికా నాయక్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న ఈ బ్యూటీ.. రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో మరింత బిజీ హీరోయిన్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Exit mobile version