Site icon TeluguMirchi.com

Sardar 2: డ్యూయల్ రోల్ కాదట.. కార్తికి డబుల్ ఛాలెంజ్ అంట! సర్దార్ 2 హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Sardar

Sardar 2: తమిళ స్టార్ హీరో కార్తి నటిస్తున్న క్రేజీ సీక్వెల్ ‘సర్దార్ 2’పై అంచనాలు భారీగా ఉన్నాయి. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమాలో తన పాత్ర, యాక్షన్ సన్నివేశాల గురించి కార్తి ఇటీవల ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘సర్దార్ 2’ కథలో తండ్రి, కొడుకు కలిసి ప్రయాణం చేస్తారని కార్తి తెలిపారు. ఈ సినిమాలో తాను తండ్రి, కొడుకు రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు చెప్పారు. ఒకే సమయంలో రెండు పాత్రలను పోషించడం తనకు చాలా సవాల్‌గా అనిపించిందని వెల్లడించారు. ముఖ్యంగా రెండు పాత్రలకు సంబంధించిన మేకప్ విషయంలో చాలా ఓపిక అవసరమైందని చెప్పారు.

కార్తికి యాక్షన్ సన్నివేశాలంటే ఎంతో ఇష్టమన్న విషయం తెలిసిందే. అయితే ‘సర్దార్ 2’లో యాక్షన్ ఎపిసోడ్స్ తనకు పూర్తిగా భిన్నమైన అనుభూతిని ఇచ్చాయని ఆయన తెలిపారు. సాధారణంగా హీరోగా యాక్షన్ చేయడం ఒక ఎత్తయితే.. ఈ సినిమాలో వృద్ధుడి పాత్రలో ఫైట్స్ చేయడం మరో ఎత్తని అన్నారు. ముసలివాడిలా కనిపిస్తూ, అదే సమయంలో శక్తివంతంగా పోరాడాల్సి రావడం తనకు ప్రత్యేకమైన ఛాలెంజ్‌గా అనిపించిందని కార్తి చెప్పారు. వాటిని యాక్షన్ సన్నివేశాల్లో చూపించడం చాలా ఆసక్తికరంగా అనిపించిందని అన్నారు. మొత్తంగా ‘సర్దార్ 2’లో యాక్షన్‌కు పెద్దపీట వేసినట్లు కార్తి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. తండ్రి, కొడుకు పాత్రల్లో కార్తి కనిపించడంతో పాటు.. వృద్ధుడి గెటప్‌లో ఆయన చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. దీంతో ‘సర్దార్ 2’పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది.

Exit mobile version