Site icon TeluguMirchi.com

Bhogi : శర్వా ‘భోగి’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్..


Bhogi : చార్మింగ్ స్టార్ శర్వానంద్, కమర్షియల్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ఓ భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఈ చిత్రం కథ 1960ల చివరలో ఉత్తర తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా సాగనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ను ‘#Sharwa38’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రకటించిన మేకర్స్, తాజాగా ఈ చిత్రానికి ‘భోగి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్‌ను ప్రకటిస్తూ ‘ఫస్ట్ స్పార్క్’ అనే వీడియోను విడుదల చేశారు. ఇందులో కత్తి, మేకపోతు, పగిలిన గాజులు, కాళ్ల పట్టీలు వంటి ఎలిమెంట్స్‌ను చూపిస్తూ, “ప్రతి రక్తపు బొట్టుకూ ఒక కారణం ఉంటుంది.. ప్రతి పండుగకీ ఓ ఉద్దేశ్యం ఉంటుంది” అనే డైలాగ్‌తో సినిమాపై ఆసక్తిని పెంచారు.

ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. గతంలో వీరిద్దరూ కలసి నటించిన ‘శతమానం భవతి’ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించడంతో, మళ్లీ జతకడుతున్న ఈ జోడీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మే మొదటి వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో డింపుల్ హయాతి కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలు సౌందర్ రాజన్ నిర్వహిస్తున్నారు.

Exit mobile version