
Seyon: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘సేయోన్’. ప్రముఖ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ సక్సెస్‌పుల్‌గా పూర్తయింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే పక్కా యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం. ‘సేయోన్’ అంటే లార్డ్ మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) అని అర్థం. ఈ చిత్ర దర్శకుడు శివకుమార్ మురుగేశన్ ఈ కథను ఎంతో పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. విశ్వనటుడు కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.
ఆకట్టుకుంటున్న శివకార్తికేయన్ లుక్
ఈ సినిమాలో శివకార్తికేయన్ మునుపెన్నడూ చూడని విధంగా ఒక ‘రఫ్ అండ్ టఫ్’ లుక్‌లో కనిపించబోతున్నారని సమాచారం. ఇటీవల విడుదలైన పోస్టర్‌లో ఆయన చేతిలో టార్చ్ లైట్లు పట్టుకొని, అగ్ని ప్రభల మధ్య, నెమలి ఈకలతో ఉగ్ర రూపంలో కనిపించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో శివకార్తికేయన్ సరసన టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీకి ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి కావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2026 అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
