Site icon TeluguMirchi.com

Su From So : చిన్న సినిమా సాధించిన పెద్ద విజయం.. త్వరలో ఓటీటీలోకి

Su from so

Su From So : ‘కాంతార’ తర్వాత చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన కన్నడ సినిమాలు వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. కంటెంట్ బలంగా ఉంటే చాలు, భారీ బడ్జెట్‌ లేకపోయినా బాక్సాఫీస్‌ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధిస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి ‘సు ఫ్రమ్ సో’ కూడా చేరింది. జేపీ తుమినాడ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 25న థియేటర్లలో విడుదలైంది. పెద్దగా ప్రమోషన్‌లు లేకుండా, ఎలాంటి హంగామా లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సైలెంట్‌గా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

స్టార్స్ లేకపోవడం, కేవలం ₹5.5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడటం వంటి కారణాలున్నప్పటికీ, ఇప్పటివరకు ఈ చిత్రం ₹80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం కన్నడలోనే కాదు, ఇతర భాషల ప్రేక్షకులూ ఈ సినిమాపై చర్చిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథకు ఇంత పెద్ద స్థాయిలో స్పందన రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

కథ విషయానికి వస్తే—ఒక తప్పు చేస్తూ పట్టుబడిన హీరో, ఆ సమస్య నుంచి తప్పించుకోవడానికి తనకు దెయ్యం పట్టిందని అబద్ధమాడతాడు. కానీ ఆ అబద్ధమే అతడిని మరింత పెద్ద ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఇదే చిత్రానికి ప్రాణం.

ఈ సినిమా OTT రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. సమాచారం ప్రకారం, ఈ చిత్రం డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Exit mobile version