
Suriya46 : తమిళ స్టార్ హీరో సూర్య, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న #Suriya46 చిత్రానికి ‘విశ్వనాథ్ & సన్స్’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. టైటిల్ వినగానే ఇది ఓ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన్న భావన కలుగుతోంది. సూర్య ఒక చిన్నారితో కలిసి కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే మంచి స్పందన రాబట్టింది. ఆ లుక్‌లో కనిపించిన భావోద్వేగం సూర్యలోని పాతకాలపు మాధుర్యాన్ని గుర్తు చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలైలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో మమిత బైజు కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్, సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. త్వరలోనే టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
‘సార్/వాతి’, ‘లక్కీ భాస్కర్’ వంటి విజయాల తర్వాత నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ ప్రతిష్టాత్మక తమిళ-తెలుగు ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ & సన్స్’పై అన్ని వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
Power in his presence. 🔥
Warmth in his embrace.🤍Bringing back the vintage magic of @Suriya_offl in a heart-touching family spectacle. 🤩#VishwanathAndSons ~ The biggest family drama of the year arrives this July. 🫶🏻#VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena… pic.twitter.com/frvwNwuU8f
— Sithara Entertainments (@SitharaEnts) March 2, 2026
