
The Great Pre Wedding Show Trailer : తిరువీర్, టీనా శ్రావ్య హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. బై 7PM, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం, అశ్మితా రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్, టైటిల్ పోస్టర్లు ఆకట్టుకోగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం హాస్యభరితమైన సన్నివేశాలతో నవ్వులు పూయిస్తుంది.
ఈ చిత్రంలో తిరువీర్ ఫోటోగ్రాఫర్ గా కనిపించబోతున్నారు. మండలం మొత్తానికీ పెళ్లిళ్ల ఫోటోలు తీయాలన్నా, ప్రీ వెడ్డింగ్ షూట్స్ తీయాలన్నా ఆయన దగ్గరకు వెళ్లాల్సిందే. అలాంటి ఫోటోగ్రాఫర్ కు అనుకోకుండా ఓ ప్రీ వెడ్డింగ్ షూట్ విషయంలో పొరపాటు జరిగితే, ఆ క్రమంలో అతను ఎదుర్కొన్న అవాంతరాలన్నింటినీ హాస్యంగా తీర్చిదిద్దారు. ఇకపోతే ‘#90’s’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న మాస్టర్ రోహన్ కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో తిరువీర్ మాట్లాడుతూ “మంచి కంటెంట్‌తో మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ నవంబర్ 7న రాబోతోంది. మా చిత్రం అందరికీ నచ్చుతుంది. మా సినిమాను ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మాకు అండగా నిలిచిన జీ సంస్థకు థాంక్స్” అని అన్నారు.
