
Trisha: తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, సీఎం విజయ్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జూన్ 22 అర్ధరాత్రి (జూన్ 23న) విజయ్ తన 52వ జన్మదినాన్ని జరుపుకోగా, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో విజయ్ కేక్‌ను కట్ చేస్తుండగా, త్రిష ఆయన పక్కనే కూర్చున్న ఫోటోను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. “నా జీవితాన్ని ఇంతగా మార్చేసిన, ప్రతిదానికీ ఒక అర్థాన్ని ఇచ్చిన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు (HBD) ❤️” అని త్రిష ఈ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ ఫోటో సోషల్ మీడియాలోకి వచ్చిన కొద్దిసేపట్లోనే వేలకు పైగా లైకులు, వేలాది కామెంట్లతో నెట్టింట హల్‌చల్ చేసింది. ‘లియో’ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, విజయ్ వ్యక్తిగత జీవితం నేపథ్యంలో గత కొంతకాలంగా వీరిపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ టైంలో త్రిష పెట్టిన పోస్ట్ వారి మధ్య ఉన్న బలమైన బంధాన్ని స్పష్టం చేసింది. అయితే కొందరు అభిమానులు ఈ ఫోటోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం వీరికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇటీవల విజయ్ అకౌంట్‌ను త్రిష అన్‌ఫాలో చేసిందంటూ నెట్టింట జరిగిన ప్రచారానికి కూడా ఈ పోస్ట్‌తో బ్రేక్ పడినట్లు అయ్యింది. ఎందుకంటే, త్రిష మొదటి నుంచీ విజయ్ అఫీషియల్ అకౌంట్‌ను ఎప్పుడూ ఫాలో అవ్వలేదు.
To the person who makes it all worth it,HBD❤️🧿
00.00✨ pic.twitter.com/2e6QcueVRP— Trish (@trishtrashers) June 23, 2026
