
VT15 : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ #VT15 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో, UV క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. హారర్-కామెడీ నేపథ్యంలో, ఇండియన్ మరియు కొరియన్ కాన్సెప్ట్‌ల మిక్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం వరుణ్ కెరీర్‌లోనే ఓ ప్రత్యేకమైన మైలురాయిగా నిలవబోతోంది. ఇప్పటికే మూడు ప్రధాన షెడ్యూల్స్ ఇండియా మరియు విదేశాల్లో పూర్తి చేశారు. అద్భుతమైన విజువల్స్‌తో సినిమా షూటింగ్ వేగంగా ముందుకెళ్తోంది.
ఇక మ్యూజిక్ పరంగా చూస్తే, థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. వరుణ్ – థమన్ కాంబో ‘తొలిప్రేమ’ తర్వాత మళ్లీ మ్యాజిక్ రిపీట్ చేయబోతోంది. ఇప్పటికే రెండు ఎనర్జిటిక్ పాటలు షూట్ పూర్తవగా, అవి సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయి. ప్రస్తుతం థమన్ మ్యూజిక్ సెషన్స్ ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్నాయి. త్వరలోనే టైటిల్ మరియు ఫస్ట్ లుక్ అఫీషియల్‌గా విడుదల చేయనున్నారు మేకర్స్.
