Site icon TeluguMirchi.com

Venky Anil 5: ‘వెంకీ అనిల్ 5’లో లెఫ్టినెంట్ కల్నల్‌గా వెంకటేష్!

Venkatesh

Venky Anil 5: టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్ 40 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అభిమానులకు ‘వెంకీ అనిల్ 5’ టీమ్ స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. ఈ సందర్భంగా సినిమాలో వెంకటేష్ పాత్రకు సంబంధించిన ప్రత్యేక లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆయన లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ఐదో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘40 Glorious Years of our Victory Venky’ అంటూ చిత్రబృందం వెంకటేష్ సినీ ప్రయాణాన్ని సెలబ్రేట్ చేస్తూ ఈ స్పెషల్ లుక్‌ను విడుదల చేసింది. మిలిటరీ ఆఫీసర్ గెటప్‌లో లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి పాత్రలో వెంకటేష్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. ఆయన కొత్త లుక్ చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఈ సినిమాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్‌ల సరసన కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు యాక్షన్, కామెడీ అంశాలను జోడించి అనిల్ రావిపూడి తనదైన శైలిలో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమా తొలి షెడ్యూల్‌ను మేకర్స్ విజయవంతంగా పూర్తి చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 2027 సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వెంకటేష్ తన కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో విభిన్న పాత్రల్లో మెప్పించారు. ఇప్పుడు లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి పాత్రలో ఆయన ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది. మరోవైపు వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌తో పాటు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, యాక్షన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

Exit mobile version